Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గంట ఎక్కువ పని చేసైనా తెలంగాణ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలి: మంత్రి హరీశ్

తెలంగాణ ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు కార్మికులు మరింత శ్రమించాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. ఇందుకోసం ఓ గంట ఎక్కువ పని చేయాలని సూచించారు. ఆర్టీసీ సమ్మె జరుగుతున్నప్పుడు తన జీవితంలో ఎప్పుడూలేని విపత్కర పరిస్థితిని ఎదుర్కొనట్టు మంత్రి తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికుల పోరాట పటిమ సీఎం కేసీఆర్ గుండెల్లో నిలిచిపోయిందని, అందుకే వారడిగిన దానికంటే ఎక్కువ ఫిట్ మెంట్ ప్రకటించారని హరీశ్ చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై సీఎం త్వరలో ప్రకటన చేస్తారన్నారు. అంతేగాక మహిళా కార్మికుల సమస్యలపై కూడా సమావేశం నిర్వహించి చర్చిస్తామని పేర్కొన్నారు.

More Telugu News