శివభక్తులపై తేనెటీగల దాడి... ఒకరు మృతి, పలువురికి గాయాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శివభక్తులపై తేనెటీగల దాడి... ఒకరు మృతి, పలువురికి గాయాలు

కడప జిల్లా సీకే దిన్నె మండలం బుగ్గా వెంకన్న ప్రాజెక్ట్ సమీపంలో మల్లేశ్వరస్వామి దర్శనం కోసం వెళుతున్న శివభక్తులపై నేటి ఉదయం తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఓ భక్తుడు అక్కడికక్కడే మరణించగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెనువెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

More Telugu News