బోల్తా కొట్టిన ‘కేశినేని’ బస్సు...30 మందికి గాయాలు, 10 మంది కండీషన్ సీరియస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బోల్తా కొట్టిన ‘కేశినేని’ బస్సు...30 మందికి గాయాలు, 10 మంది కండీషన్ సీరియస్

తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిండా ప్రయాణికులతో నిన్న రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాదుకు బయలుదేరిన కేశినేని ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సు అనంతపురం జిల్లా పరిధిలో బోల్తా కొట్టింది. జిల్లాలోని గుత్తి మండలం కొత్తపేట వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో బస్సులోని 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా వుంది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

More Telugu News