Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిన్నస్వామి స్టేడియాన్ని ముంచెత్తిన వరుణుడు... మ్యాచ్ రద్దు

బెంగళూరులో వర్షం కారణంగా ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ రద్దయింది. చిన్నస్వామి స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. అనంతరం, వరుణుడు ప్రత్యక్షమవడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కాస్త ఆలస్యంగా లక్ష్యఛేదనకు దిగింది. అయితే, మళ్లీ వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఈ దశలో ఎంతకీ వరుణుడు శాంతించకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

More Telugu News