ఇబ్బందుల్లో తెలంగాణ కాంగ్రెస్... ఒక్క సీటు కోసం 40 మంది పోటీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇబ్బందుల్లో తెలంగాణ కాంగ్రెస్... ఒక్క సీటు కోసం 40 మంది పోటీ!

త్వరలో తెలంగాణ శాసన మండలికి జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలుచుకునే అవకాశాలు ఉండడంతో ఎవరిని ఎంపిక చేయాలన్న విషయమై ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఈ వ్యవహారం పార్టీకి తలనొప్పి తెచ్చి పెట్టే అంశమేనని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఉన్న ఒక్క సీటుకూ సుమారు 40 మంది కాంగ్రెస్ పెద్దలు పోటీ పడుతున్నారు. ఈ మేరకు సీనియర్ నేతలు డీ శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 21 మంది ఎమ్మెల్యేలు గెలువగా, వారిలో నలుగురు టిఆర్ఎస్ లో చేరిపోయిన సంగతి తెలిసిందే. ఇండిపెండెంట్ సభ్యుడు దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 18కి చేరింది. తెలుగుదేశం, బీజేపీలతో పోలిస్తే కాంగ్రెస్ కు రెండు సీట్లు ఎక్కువగా ఉండడంతో వామపక్షాల సహకారంతో ఒక సీటు సులువుగా గెలవచ్చన్నది కాంగ్రెస్ అభిప్రాయం. ఆ ఒక్క సీటూ ఎవరికి దక్కేనో?

More Telugu News