ఉద్యోగం వద్దు, న్యాయం కావాలి: అపర్ణ తల్లి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉద్యోగం వద్దు, న్యాయం కావాలి: అపర్ణ తల్లి

తనకు ఉద్యోగం అవసరం లేదని, న్యాయం కావాలని భారత క్రీడాప్రాధికార సంస్ధ (సాయ్)కు క్రీడాకారిణి అపర్ణ రామభద్రన్ తల్లి గీత స్పష్టం చేశారు. అళప్పీ సాయ్ వాటర్ స్పోర్ట్స్ సెంటర్ లో అపర్ణ రామభద్రన్, మరో ముగ్గురు అథ్లెట్లు విషపూరిత పండ్ల (సెర్బెరా ఒడోలమ్)ను తిని ఆత్మహత్యాయత్నం చేయగా, అపర్ణ మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అపర్ణ తల్లి గీతకు సాయ్ ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో నిందితులను కాపాడేందుకు సాయ్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, తనకు న్యాయం కావాలని, ఇద్దరు సీనియర్లు తనను వేధిస్తున్నారని అపర్ణ తనతో చెప్పిందని గీత ఆరోపించారు.

More Telugu News