నార్వేలో సందడి చేసిన ఏపీ స్పీకర్ కోడెల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నార్వేలో సందడి చేసిన ఏపీ స్పీకర్ కోడెల

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ నార్వేలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా, ఆ దేశ రాజధాని ఓస్లోలోని తెలుగువారితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ, ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. అంతేకాకుండా, ఇటీవల సత్తెనపల్లిలో వేలాది మంది విద్యార్థులు చేతులు కడిగే కార్యక్రమాన్ని నిర్వహించి, గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించిన అంశాన్ని వారికి తెలిపారు. కార్యక్రమం అనంతరం కోడెలను నార్వే తెలుగు ఫోరం సన్మానించింది.

More Telugu News