కాబూల్ కాల్పుల మృతులకు మోదీ సంతాపం... మృతుల్లో ఒకరు ఏపీకి చెందిన డాక్టర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాబూల్ కాల్పుల మృతులకు మోదీ సంతాపం... మృతుల్లో ఒకరు ఏపీకి చెందిన డాక్టర్

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 14 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ ఉగ్రదాడిపై చైనా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ స్పందించారు. ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించిన ఆయన... ఉగ్రవాదులపై జరిపే పోరులో ఆఫ్ఘనిస్థాన్ కు సహకరిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనితో మాట్లాడుతూ, మోదీ హామీ ఇచ్చారు. మృతి చెందిన భారతీయుల్లో ఒకరిని ఆంధ్రప్రదేశ్ కు చెందిన డాక్టర్ సతీష్ చంద్రగా గుర్తించారు.

More Telugu News