కాబూల్ లో ఉగ్రవాది కాల్పులు...ఇద్దరు ఇండియన్లు, ఏడుగురు విదేశీయులు మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాబూల్ లో ఉగ్రవాది కాల్పులు...ఇద్దరు ఇండియన్లు, ఏడుగురు విదేశీయులు మృతి

నిన్న పాకిస్థాన్, నేడు ఆప్ఘనిస్థాన్... ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. నిన్న పాకిస్థాన్ నగరం కరాచీలో సామాన్యులు ప్రయాణిస్తున్న బస్సుపై మూకుమ్మడి దాడి చేసిన తాలిబన్ ఉగ్రవాదులు 47 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనను మరువకముందే అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఓ ఉగ్రవాది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఓ భవనంలోకి చొచ్చుకువెళ్లిన సదరు ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు, ఏడుగురు ఇతర దేశాలకు చెందిన వారు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

More Telugu News