ముంబైలో కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం... ఫైర్ సిబ్బందికి గాయాలు, ఒకరి గల్లంతు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముంబైలో కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం... ఫైర్ సిబ్బందికి గాయాలు, ఒకరి గల్లంతు

ముంబైలోని కున్వాదేవి ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. అగ్ని ప్రమాదం సంభవించిన సదరు భవనంలో మంటలను ఆర్పుతున్న క్రమంలో భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో మంటలార్పుతున్న ఫైర్ సిబ్బందిలోని ఓ ఫైర్ మన్ గల్లంతు కాగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించిన ఫైర్ సిబ్బంది గల్లంతైన తమ సహచరుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

More Telugu News