ప్రచారం కోసమే పార్టీలు నన్ను లక్ష్యం చేసుకుంటున్నాయి: వెంకయ్యనాయుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రచారం కోసమే పార్టీలు నన్ను లక్ష్యం చేసుకుంటున్నాయి: వెంకయ్యనాయుడు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ప్రచారం కోసమే రాజకీయ పార్టీలు తనను లక్ష్యంగా చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తర్జనభర్జన పడుతోందన్న ఆయన, హోదా అంశం ఆర్థిక, హోంశాఖ పరిధిలో ఉందని ఢిల్లీలో పేర్కొన్నారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా పొందే అర్హత లేదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందన్నారు. విభజన చట్టంలో ఇవ్వని హామీలు సైతం నెరవేర్చామని, ఐదేళ్లలో కేంద్రమే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తుందని వెంకయ్య తెలిపారు.

More Telugu News