విదేశీ టాలెంట్ హంట్ లో ఫ్లిప్ కార్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విదేశీ టాలెంట్ హంట్ లో ఫ్లిప్ కార్ట్!

ఈ-కామర్స్ రంగంలో అంతర్జాతీయ సంస్థలు అమేజాన్, అలీబాబాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న దేశీయ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కు దేశీయంగా లభిస్తున్న టాలెంట్ సరిపోవడం లేదట. సంస్థను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు విదేశీ టాలెంట్ కావాల్సిందేనంటున్నారు ఆ సంస్థ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పునీత్ సోనీ. మొన్నటిదాకా గూగుల్ లో పనిచేసిన ఆయన ఇటీవలే ఫ్లిప్ కార్ట్ లో చేరారు. భారత సంతతికి చెందిన పునీత్ సోనీ రాకతో ఫ్లిప్ కార్ట్ పనితీరు మరింత మెరుగుపడుతుందన్న భావన సర్వత్ర వ్యక్తమైంది. అందుకనుగుణంగానే పనిచేస్తున్న ఆయన విదేశీ టాలెంట్ వైపు మొగ్గుచూపడం గమనార్హం.

More Telugu News