ధనం, అధికారం వదులుకోవాలంటే ఎంతో ధైర్యం, నిబద్ధత కావాలి: మోదీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధనం, అధికారం వదులుకోవాలంటే ఎంతో ధైర్యం, నిబద్ధత కావాలి: మోదీ

ధనం, అధికారం సహా సర్వం వదులుకోవాలంటే ఎంతో ధైర్యం, నిబద్ధత కావాలని, సర్వం వదులుకుని బుద్ధుడు ఆదర్శంగా నిలిచాడని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలోని తల్కతోరా మైదానంలో జరిగిన బుద్ధపూర్ణిమ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుద్ధుడు పుట్టిన నేపాల్ కష్టాల్లో ఉందని, వారికి అండగా నిలవాల్సిన సమయమని అన్నారు. బుద్ధుడు లేకపోతే 21వ శతాబ్దం మనది కాదని, ఆయన జన్మించిన కారణంగా 21వ శతాబ్దం ఆసియాదైందని మోదీ పేర్కొన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కావాలంటే బుద్ధుని మార్గమే అనుసరించాలని ఆయన సూచించారు.

More Telugu News