70 నుంచి 80 వేల పుస్తకాలను చదివా... అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చా: కేసీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

70 నుంచి 80 వేల పుస్తకాలను చదివా... అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చా: కేసీఆర్

నాగార్జునసాగర్ లో జరుగుతున్న టీఆర్ఎస్ నేతల శిక్షణ శిబిరంలో కేసీఆర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను 70 వేల నుంచి 80 వేల పుస్తకాలను చదివానని చెప్పారు. గతంలో తాను ఎక్కడికెళ్లినా బట్టల బ్యాగ్ కన్నా, పుస్తకాల బ్యాగే పెద్దగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా, అనుకోకుండానే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తామెవరమూ వెయ్యేళ్లు బతకడానికి ఇక్కడకు రాలేదని... అవినీతికి ఆమడ దూరంలో ఉండి, ప్రజా సేవ చేయాలని తమ నేతలకు సూచించారు. అలాగైతేనే, తెలంగాణ తొలి తరం నాయకులుగా చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. ఈ శిక్షణ శిబిరాల వల్ల మనం చాలా అనుభవాలను పంచుకున్నామని... భవిష్యత్తులో కూడా కనీసం ఆర్నెల్లకోసారైనా శిక్షణా తరగతులు పెట్టుకుందామని చెప్పారు.

More Telugu News