Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న్యూజిలాండ్ లో భూకంపం... రాజధానిలో కూడా ప్రకంపనలు

నేపాల్ ను అతలాకుతలం చేసిన భూకంపం... ఈ ఉదయం న్యూజిలాండ్ ను వణికించింది. న్యూజిలాండ్ కు సమీపంలో ఉండే వనాకా ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో, 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దేశ రాజధాని వెల్లింగ్టన్ లో కూడా ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత 6గా నమోదయింది. అయితే, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించ లేదని స్థానికులు ట్వీట్ చేస్తున్నారు. మరోవైపు, అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో కూడా భూమి స్వల్పంగా కంపించిన సంగతి తెలిసిందే.

More Telugu News