బెజవాడ మెట్రో రైలుకు గ్రీన్ సిగ్నల్... మరికాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బెజవాడ మెట్రో రైలుకు గ్రీన్ సిగ్నల్... మరికాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాజధాని సమీపంలోని విజయవాడ నగరంలో కొత్తగా ఏర్పాటు కానున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు నేడు ఏపీ సర్కారు పచ్చజెండా ఊపనుంది. ఈ మేరకు మరికాసేపట్లో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో భేటీ కానున్న ఆ రాష్ట్ర కేబినెట్ ప్రాజెక్టుకు తుది అనుమతి ఇవ్వనుంది. రాష్ట్రంలో ఇసుక వేలం, నవ్యాంధ్ర రాజధానికి శంకుస్థాపన, హైకోర్టు ఏర్పాటుపై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు తీర్పు తదితరాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నట్లు సమాచారం.

More Telugu News