అనంత ‘హత్య’పై గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనంత ‘హత్య’పై గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం వైసీపీ మాజీ కన్వీనర్ ప్రసాదరెడ్డి హత్య, తదనంతర పరిణామాలపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు. తమ పార్టీని తుడిచిపెట్టేందుకు అధికార టీడీపీ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని భావిస్తున్న ఆయన నేడు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ ను కలవనున్నారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు రాజ్ భవన్ కు పార్టీ నేతలతో కలిసి వెళ్లనున్న జగన్, గవర్నర్ ను కలుస్తారు. ఈ సందర్భంగా ఆయన తన పార్టీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ సాగిస్తున్న దాడులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు.

More Telugu News