రూ. 2500 కోట్ల విలువైన 'బిగ్ ఫైట్' విజేత మేవెదర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ. 2500 కోట్ల విలువైన 'బిగ్ ఫైట్' విజేత మేవెదర్

వరల్డ్ బాక్సింగ్ చరిత్రలో రూ. 2500 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టి, అత్యంత ఖరీదైన పోరుగా, ఫైట్ ఆఫ్ ది సెంచరీగా నిలిచిన 'బిగ్ ఫైట్'లో అమెరికాకు చెందిన కింగ్స్‌ ఫ్లాయిడ్ మేవెదర్ విజయం సాధించారు. మొత్తం 12 రౌండ్ల పాటు పోటీ జరుగగా, న్యాయనిర్ణేతలు మేవెదర్ గెలిచినట్టు ఏకగ్రీవంగా ప్రకటించారు. ఫిలిప్పీన్స్ కు చెందిన మ్యానీ పాకియోతో తలపడిన మేవెదర్ ఆది నుంచి ప్రత్యర్థిపై తనదైన శైలిలో ఆధిక్యం చూపగా, కొన్ని సార్లు తనదైన శైలిలో పాకియో పంచ్ లు కురిపించి వీక్షకులను అలరించారు. న్యాయ నిర్ణేతల నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని మేవెదర్ అద్భుత ఆటగాడని పోటీ అనంతరం పాకియో వ్యాఖ్యానించారు. కాగా, ఎవరో ఒక ఆటగాడు నాకౌట్ అవుతాడని ఆశించిన బాక్సింగ్ అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది. ఈ పోటీ ద్వారా మొత్తం రూ. 2,500 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఖర్చులు పోగా మిగిలిన మొత్తంలో 60 శాతం మేవెదర్, 40 శాతం పాకియోలకు ఇవ్వాలని ముందుగానే ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.

More Telugu News