14 వేల దరఖాస్తుల్లో 9 వేలను పరిష్కరించా: టీడీపీ పోలిట్ బ్యూరోకు నారా లోకేశ్ నివేదిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

14 వేల దరఖాస్తుల్లో 9 వేలను పరిష్కరించా: టీడీపీ పోలిట్ బ్యూరోకు నారా లోకేశ్ నివేదిక

టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశానికి ఆ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ ఓ నివేదికను సమర్పించారు. గడచిన 10 నెలల కాలంలో 50 వేల మంది కార్యకర్తలను కలిశానని ఆయన ఆ నివేదికలో పేర్కొన్నారు. కార్యకర్తల నుంచి వివిధ అంశాలకు సంబంధించి 14 వేల దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్న ఆయన, వాటిలో 9 వేల దరఖాస్తులకు పరిష్కారం చూపానని కూడా నివేదించారు. విద్య, వైద్యం, ఉపాధి అంశాలకు సంబంధించే మెజారిటీ దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. వివిధ ప్రమాదాల్లో పార్టీకి చెందిన 524 మంది కార్యకర్తలు మరణించారని, వీరిలో 49 మంది కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించానని లోకేశ్ ఆ నివేదికలో వెల్లడించారు.

More Telugu News