క్యాంపస్ ఇంటర్వ్యూలో విప్రోకు సెలెక్ట్ అయ్యాడు... కానీ, ఇంతలోనే లారీ అతన్ని బలిగొంది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్యాంపస్ ఇంటర్వ్యూలో విప్రోకు సెలెక్ట్ అయ్యాడు... కానీ, ఇంతలోనే లారీ అతన్ని బలిగొంది

బీటెక్ చదువుతున్న విద్యార్థి శ్రీకాంత్ కాలేజ్ లో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్ లో విప్రో సంస్థకు ఎంపికయ్యాడు. దీంతో, లైఫ్ సెటిల్ అయిపోయిందన్న ఆనందంలో ఉన్న ఆ యువకుడిని దురదృష్టం లారీ రూపంలో వెంటాడింది. విశాఖపట్నం సబ్బవరం వద్ద బైక్ పై వెళుతున్న అతడిని లారీ ఢీకొట్టింది. దీంతో అతను దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. శ్రీకాంత్ మరణంతో అతడి కుటుంబంలో విషాదం అలముకుంది.

More Telugu News