మా నాన్న ఫొటోలు, వివరాలు ఉంటే పంపండి: అమితాబ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా నాన్న ఫొటోలు, వివరాలు ఉంటే పంపండి: అమితాబ్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన తండ్రి దివంగత హరివంశ్ రాయ్ బచ్చన్ కోసం ఓ వెట్ సైట్ ఏర్పాటు చేస్తున్నారు. సుప్రసిద్ధ కవిగా పేరుగాంచిన డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్ కు సంబంధించిన వివరాలు, ఫొటోలు ఫ్యాన్స్ వద్ద ఉంటే తనతో పంచుకోవాల్సిందిగా బిగ్ బి కోరారు. "నేనో సమగ్రమైన వెబ్ సైట్ ను ప్రారంభించదలచుకున్నాను. సరైన సమాచారం ఇవ్వడమే దాని వెనుకున్న ఉద్దేశం. చాలా సైట్లు ఆయన గురించి సరైన సమాచారం అందివ్వడంలేదు. ప్రస్తుతం నా తండ్రి, సాహితీస్రష్ఠ హరివంశ్ రాయ్ బచ్చన్ సంబంధిత సమాచారం, వివరాలు, ఫొటోలు సేకరిస్తున్నాను. మీ వద్ద ఆయనకు సంబంధించిన సమాచారం, లేఖలు, సంభాషణల తాలూకు ప్రతులు, కవితలు, కథలు, ప్రసంగాలు ఉంటే దయచేసి thebachchanfamily@gmail.com మెయిల్ చేయండి" అని ట్విట్టర్ వేదికగా కోరారు.

More Telugu News