స్వస్తిక్ గుర్తు కనిపిస్తే చాలు, ఒంటికాలిపై లేస్తున్నారు...హిందూ దేవాలయాలపై దాడులక్కూడా ఇదే కారణమా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్వస్తిక్ గుర్తు కనిపిస్తే చాలు, ఒంటికాలిపై లేస్తున్నారు...హిందూ దేవాలయాలపై దాడులక్కూడా ఇదే కారణమా?

హిందువుల పవిత్ర చిహ్నమైన స్వస్తిక్ గుర్తు కనిపిస్తే చాలు, అమెరికాలో ఒంటికాలిపై లేస్తున్నారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఏకంగా స్వస్తిక్ గుర్తును బ్యాన్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 'ఓం'లాగానే 'స్వస్తిక్' చిహ్నం కూడా భారతీయులకు పవిత్రమైనది. అయితే, పాశ్చాత్యులకు మాత్రం అత్యంత భయంకరమైనది స్వస్తిక్. దానికి కారణమేంటంటే, జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ పార్టీ నాజీ గుర్తు కూడా స్వస్తిక్ కావడమే. ప్రాచ్యమతాలపై అధ్యయనం చేస్తున్న ఓ యూదు విద్యార్థి భారత్ వచ్చాడు. భారత్ లోని మతాలపై అధ్యయనం చేసిన ఆ విద్యార్థి, హిందువుల పవిత్ర చిహ్నమైన స్వస్తిక్ ను తీసుకుని తిరిగి యూనివర్సిటీకి వెళ్లాడు. అదే యూనివర్సిటీలో చదువుతున్న మరో యూదు విద్యార్థి దీనిని చూసి నాజీల చిహ్నమైన స్వస్తిక్ గా పొరబడ్డాడు. నాజీల ప్రమాదం ఉందని భావించి యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో యూనివర్సిటీ అధికారులు అతనిని వివరణ అడిగి, శాంతించారు. అయినప్పటికీ విద్యార్థుల మనోభావాలు దెబ్బతినకుండా స్వస్తిక్ గుర్తును నిషేధించేందుకు సిద్ధమవుతున్నారు. ఈమధ్య కాలంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దాడులు జరిగిన దేవాలయాల్లో స్వస్తిక్ గుర్తువేసి 'గెట్ అవుట్' అని రాశారు.

More Telugu News