రైతు గజేంద్ర ఆత్మహత్యకు, భూసేకరణ చట్టానికి సంబంధం లేదు: వెంకయ్యనాయుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రైతు గజేంద్ర ఆత్మహత్యకు, భూసేకరణ చట్టానికి సంబంధం లేదు: వెంకయ్యనాయుడు

ఢిల్లీలో ఆప్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్యకు భూసేకరణ చట్టానికి సంబంధం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, భూసేకరణ చట్టంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. రైతు ఆత్మహత్యలు వ్యవస్థ వైఫల్యమని, గత 20 ఏళ్లుగా అవి సంభవిస్తూనే ఉన్నాయని ఆయన చెప్పారు. 1995 నుంచి ఇప్పటి వరుకు 2.97 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, యూపీఏ హయాంలో ఏటా 15 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. యూపీఏ హయాంలో భూసేకరణ చట్టం రూపొందించిన తరువాత పలు అవకతవకలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. 2 లక్షల ఎకరాల భూమిని ఎస్ఈజెడ్ లు, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని ఆయన విమర్శించారు.

More Telugu News