మద్యం మత్తులో ప్రయాణికుడి వీరంగం... అనంత బస్టాండ్ లో ఆర్టీసీ డ్రైవర్ మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మద్యం మత్తులో ప్రయాణికుడి వీరంగం... అనంత బస్టాండ్ లో ఆర్టీసీ డ్రైవర్ మృతి

అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ లో నేటి ఉదయం దారుణం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ తో నెలకొన్న చిన్నపాటి వివాదం నేపథ్యంలో మద్యం మత్తు తలకెక్కిన ఓ ప్రయాణికుడు ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ దాడిలో డ్రైవర్ ఆంజనేయులు అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు దాడికి దిగిన ప్రయాణికుడు నారాయణప్పను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

More Telugu News