Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫేస్ బుక్ కొత్త యాప్... గుట్టువిప్పుతుంది

ఫేస్ బుక్ కొత్త యాప్ ను విడుదల చేసింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పెరిగిపోతుండడంతో వారికి మరింత దగ్గరయ్యేందుకు ఫేస్ బుక్ సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా ఏదైనా పనిలో ఉన్నప్పుడు కానీ, మూడ్ బాలేనప్పుడు కానీ ఫోన్ వస్తే చిరాగ్గా ఉంటుంది. తెలిసిన వారి నుంచి కాల్ వస్తే సరే కానీ, తెలియని వారి నుంచి ఫోన్ వస్తే అసహనం మరింత పెరిగిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఫేస్ బుక్ 'హలో' పేరిట యాప్ ను విడుదల చేసింది. ఈ యాప్ ఫేస్ బుక్ తో అనుసంధానమై ఉంటుంది. మన ఫేస్ బుక్ అకౌంట్ లోని మిత్రుల సమాచారం ఆధారంగా ఫోన్ నెంబర్లను గుర్తిస్తుంది. మనకు ఎవరు ఫోన్ చేస్తున్నారో చెప్పేస్తుంది. ఫోన్ లో నెంబర్ సేవ్ చేసుకోకున్నా, కాల్ చేస్తే, యాప్ వినియోగించేవారికి ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలిసిపోతుంది. అంతే కాదు, అనవసర కాల్స్ రాకుండా నెంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టుకోవచ్చని ఫేస్ బుక్ చెబుతోంది. ఫేస్ బుక్ లోని స్నేహితులకు ఈ యాప్ ద్వారా సులభంగా కాల్ చేసుకునే సౌలభ్యం కల్పించినట్టు ఫేస్ బుక్ తెలిపింది.

More Telugu News