సూసైడ్ నోట్ లో ఉన్న చేతిరాత గజేంద్రది కాదట!
రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య వ్యవహారంలో కొత్తకోణం వెలుగుచూసింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ జరుగుతుండగా, ఈ రాజస్థాన్ రైతు చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు విడవడం సంచలనం కలిగించింది. ఘటనను టీవీ చానళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఈ క్రమంలో గజేంద్ర సూసైడ్ నోట్ అంటూ ఓ లేఖను కూడా క్లిప్పింగ్స్ చూపాయి. అయితే, ఆ సూసైడ్ నోట్ లో ఉన్న చేతిరాత గజేంద్రది కాదని అంటున్నారు, అతని కుటుంబ సభ్యులు. గజేంద్ర చేతిరాత అలా ఉండదని అతని సోదరి, మేనత్త తెలిపారు. అసలు, గజేంద్ర తీవ్ర వ్యాకులతకు లోనైనట్టుగా కూడా కనిపించలేదని ఇతర కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.