మీరే చెప్పండి... రైతు ఆత్మహత్యలు ఎలా ఆపాలి?: మోదీ
దేశంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలను ఆపాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని ప్రజా ప్రతినిధులతో పాటు దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యల ఘటనలు అత్యంత హృదయ విదారకమని వ్యాఖ్యానించిన ఆయన, ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలను సహృదయంతో స్వీకరిస్తామని, మేలైన వాటిని ఎంపికచేసి అమలు చేస్తామని అన్నారు. బాధిత రైతు కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనని అన్న ఆయన కష్టాల్లో ఉన్న రైతులను ఒంటరిగా వదిలివేయబోమని వివరించారు.