హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఢీకొట్టుకున్న రెండు కార్లు... ఇద్దరి మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఢీకొట్టుకున్న రెండు కార్లు... ఇద్దరి మృతి

హైదరాబాదు శివారు మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొట్టుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమవగా, మరో చిన్నారి గాయాలతో చనిపోయినట్లు తెలిసింది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తిని నిజామాబాద్ కు చెందిన ఇస్మాయిల్ గా గుర్తించారు. చిన్నారి వివరాలు తెలియాల్సివుంది

More Telugu News