Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో కూలిన మూడంతస్తుల భవనం... ఒకరు మృతి

ఢిల్లీలోని మోతీనగర్ సుదర్శన్ పార్కులో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ఆరుగురికి గాయాలయ్యాయి. భవనంలో గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఘటన జరిగిందని అంటున్నారు. వెంటనే ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ, "అది మూడంతస్తుల భవనం. గ్యాస్ సిలిండర్ పేలడంతో భవనం కుప్పకూలింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆరుగురిని రక్షించి చికిత్స కోసం దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించాం" అని తెలిపారు. ఉదయం 7.45 నిమిషాలకు ఈ ఘటన జరుగగా, ఇంకా ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

More Telugu News