Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తలకు గాయంతో ఆసుపత్రిపాలైన మరో బెంగాల్ క్రికెటర్

యువ క్రికెటర్ అంకిత్ కేసరి మరణవార్త మరువకముందే మరో క్రికెటర్ గాయపడిన వార్త వెలుగులోకి వచ్చింది. బెంగాల్ కే చెందిన రాహుల్ ఘోష్ అనే యువ క్రికెటర్ కు లీగ్ క్రికెట్ లో ఆడుతుండగా తలకు బలమైన గాయమైంది. మంగళవారం ఫీల్డింగ్ చేస్తుండగా ఘోష్ గాయపడ్డాడు. దీంతో, అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న డాక్టర్ మాట్లాడుతూ... తలకు ఎడమవైపున గాయమైందని, సీీటీ స్కాన్ లో రక్తం గడ్డకట్టినట్టు తేలిందని తెలిపారు. ప్రస్తుతం ఆ క్రికెటర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయినాగానీ, ఏడెనిమిది రోజులు పరిశీలనలో ఉంచుతామని చెప్పారు.

More Telugu News