సుష్మాజీ... ఆరోగ్యం ఎలా ఉంది?: విదేశాంగ మంత్రికి సోనియా, రాహుల్ పరామర్శ!
బీజేపీ నేత, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు పరామర్శించారు. నిన్నటి లోక్ సభ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నినాదాలతో సభ వాయిదా పడ్డాక, నేరుగా సుష్మ వద్దకు వెళ్లిన సోనియా, రాహుల్ లు ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు. ‘‘బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది?’’ అంటూ సుష్మాను పలకరించారు. సుష్మా కూడా వారిద్దరితో నవ్వుతూనే మాట్లాడారు. పార్లమెంటు హౌస్ లో ఆదివారం జరిగిన ఓ సదస్సుకు హాజరైన సందర్భంగా మెట్లపై తడబడ్డ సుష్మా కాలు బెణికింది. అయినా ఆమె యథావిధిగా తన విధులకు హాజరవుతున్నారు.