రామాంతపూర్ లో ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామాంతపూర్ లో ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి

ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న యువతి రీతూ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని రామాంతపూర్, ఇందిరానగర్ కాలనీలోని ఓ అపార్ట్ మెంటులో జరిగింది. రీతూ భర్తే ఆమెను హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తూ, ఆమె బంధువులు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాలే ఆమె మరణానికి కారణమని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆమె తలపై బలమైన గాయం ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. రీతూ మరణానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News