కనీసం 20 ఏళ్లు నియంతృత్వ పాలన సాగాలన్న నేతాజీ... వెల్లడించిన నాటి పుస్తకం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కనీసం 20 ఏళ్లు నియంతృత్వ పాలన సాగాలన్న నేతాజీ... వెల్లడించిన నాటి పుస్తకం!

అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా ముందుకు సాగాలంటే స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కనీసం 20 సంవత్సరాల పాటు ఇండియాలో నియంతృత్వ పాలన కొనసాగాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ భావించినట్టు తెలుస్తోంది. అందువల్లే తొలి ప్రధాని నెహ్రూ తన పదవీ కాంక్షతో దీర్ఘకాలం పాటు ఆయనపై నిఘాను కొనసాగించి ఉండవచ్చని సమాచారం. 1935లో లండన్ లో నేతాజీ రాసిన పుస్తకం 'ఇండియన్ స్ట్రగుల్' ప్రచురితం కాగా, అందులో తన భావాలను ఆయన స్పష్టంగా తెలియజేశారు. నియంతృత్వం, కమ్యూనిజంతో కూడిన ప్రభుత్వం పాలిస్తేనే ఇండియా దారిలో పడుతుందని ఆయన ఆ పుస్తకంలో రాశారు. దీన్ని ఆయన సామ్యవాదంగా అభివర్ణించారు. 1935 లో రోమ్ కు వెళ్లిన నేతాజీ ఆనాటి ఇటలీ నియంత ముస్సోలినీని కలిసి తన పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు కూడా. గత కొంతకాలంగా నేతాజీ గురించి పలు సందేహాలు వస్తుండడం, ఆయన అదృశ్యంపై నెలకొన్న సందేహాలు, ప్రభుత్వ అధీనంలోని పలు పత్రాల సమాచారం తదితర అంశాలపై మోదీ సర్కారు ప్రత్యేక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.

More Telugu News