Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్ర మంత్రులను మోదీ కట్టడి చేయడంలేదు: జ్యోతిరాదిత్య సింధియా

ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చర్మ రంగుపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ప్రధానమంత్రి మౌనం వహిస్తున్నారన్నారు. గిరిరాజ్ తన వ్యాఖ్యలతో సోనియాను అవమానించారని, అయినా ప్రభుత్వంలో చలనం లేదని అన్నారు. ఆ వ్యాఖ్యలపై మోదీ సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరపున స్పందించిన మంత్రి వెంకయ్యనాయుడు, గిరిరాజ్ వ్యాఖ్యలను ప్రభుత్వం సమర్ధించడం లేదన్నారు. మహిళా నేతలపై వ్యాఖ్యలు సరికాదని, కానీ ఈ విషయంలో ప్రధానిని లాగడం కూడా సరికాదని ముక్తాయించారు. దాంతో మరింత అసహనం చెందిన కాంగ్రెస్ నేతలు సభలో నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అటు స్పీకర్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. ఈ క్రమంలో సభలో విపక్ష నేతల ఆందోళనతో గందరగోళం నెలకొంది.

More Telugu News