Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహా' మంత్రులకిక పోలీసులు సెల్యూట్ కొట్టరు!

మహారాష్ట్రలో మంత్రులకు పోలీసులు ఇక సెల్యూట్ కొట్టరు. జిల్లా స్థాయి పర్యటనలలో భాగంగా మంత్రులు వెళ్లినప్పుడు పోలీసులు గౌరవ వందనం సమర్పించి వారికి స్వాగతం పలుకుతారని తెలిసిన సంగతి తెలిసిందే. బ్రిటిష్ కాలంనాటి ఈ సంప్రదాయాన్ని ఇకపై పాటించరాదని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రులతోపాటు రాష్ట్ర స్థాయి అధికారులకు సైతం ఇదే నియమం వర్తిస్తుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు పాత సంప్రదాయాన్ని వదిలివేయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు వీవీఐపీలకు కల్పిస్తున్న భద్రతను కూడా తగ్గించాలని ఆయన సూచించినట్టు సమాచారం.

More Telugu News