రూ.16 కోట్లు ఇమ్మని నేనెవరినీ అడగలేదు: యువరాజ్ సింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ.16 కోట్లు ఇమ్మని నేనెవరినీ అడగలేదు: యువరాజ్ సింగ్

ప్రస్తుత ఐపీఎల్ లో రికార్డు స్థాయి ఫీజు తీసుకుంటున్న క్రికెటర్ యువరాజ్ సింగ్. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రూ.16 కోట్లు వెచ్చించి యువీని సొంతం చేసుకుంది. ప్రస్తుత సీజన్ లో జట్టు పరిస్థితి అంతగా ఏం బాగోలేకపోయినప్పటికీ, యువీ గట్టెక్కిస్తాడని అందరూ ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు తనకు అన్ని కోట్లు ఇమ్మని డిమాండ్ చేసినట్టు వచ్చిన వార్తలను యువీ పూర్తిగా ఖండిస్తున్నాడు. "నేనెప్పుడూ అంత ఇమ్మని (రూ.16 కోట్లు) అడగలేదు. అది నా చేతుల్లో లేదు. వేలంలో ఇతర క్రీడాకారుల్లానే నేను ఒకడిని. ఐపీఎల్ లో డబ్బు కన్నా క్రికెట్ ఆడటమే నాకు ప్రధానం" అని యువీ విశాఖలో మ్యాచ్ జరిగిన సందర్భంగా సమాధానమిచ్చాడు.

More Telugu News