ఢిల్లీ కోర్టు ఆవరణలో న్యాయవాది మృతదేహం... కోర్టు ప్రాంగణంలోనే హత్య చేశారట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీ కోర్టు ఆవరణలో న్యాయవాది మృతదేహం... కోర్టు ప్రాంగణంలోనే హత్య చేశారట!

దేశ రాజధాని ఢిల్లీలో నేరాలు పెరిగిపోతున్నాయి. నిత్యం అత్యాచార ఘటనలు వెలుగుచూస్తున్న రాజధాని నగరంలో హత్యలూ కలకలం రేపుతున్నాయి. నేటి ఉదయం నగరంలోని హజారీ కోర్టు ఆవరణలో ఓ న్యాయవాది మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతుడిని న్యాయవాది రాజీవ్ శర్మగా గుర్తించారు. న్యాయవాదిని గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు ప్రాంగణంలోనే దారుణంగా హతమార్చినట్లు ఆ తర్వాత పోలీసులు నిర్ధారించారు.ఈ ఘటనకు నిరసనగా న్యాయవాదులంతా విధులను బహిష్కరించారని ఢిల్లీ బార్ అసోసియేషన్ సభ్యుడు శర్మ తెలిపారు.

More Telugu News