జనతా పరివార్ విలీనంపై అధికారిక ప్రకటన.... ములాయం సింగ్ అధ్యక్షతన ఏర్పాటు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జనతా పరివార్ విలీనంపై అధికారిక ప్రకటన.... ములాయం సింగ్ అధ్యక్షతన ఏర్పాటు

జనతా పరివార్ విలీనం అధికారికంగా ఖరారైంది. సమాజ్ వాదీ, ఆర్ జేడీ, జేడీయూ, జేడీఎన్, ఐఎన్ఎల్ డీ, ఎన్ జేపీ పార్టీలు విలీనమయ్యాయి. ఎస్పీ అధినేత ములాయం సింగ్ అధ్యక్షతన కొత్త ఫ్రంట్ ఏర్పడింది. కొత్త పార్లమెంటరీ నేతగా కూడా ములాయం వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియా సమావేశంలో శరద్ యాదవ్, ములాయం పరివార్ పై అధికారికంగా ప్రకటన చేశారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని సమిష్టిగా ఎదుర్కొనేందుకు మళ్లీ ఆరు పార్టీల జనతా పరివార్ ఏకమైంది. వచ్చే ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పరివార్ పోటీ చేస్తుంది. పార్టీ పేరు, జెండా, ఎన్నికల గుర్తు ఖరారుకు ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేశారు. అంతకుముందు రాజధానిలో ములాయం నివాసంలో ఆరు పార్టీల నేతలు సమావేశమై చర్చించారు.

More Telugu News