నేడు కాంగ్రెస్ కార్యాలయానికి రానున్న యువరాజు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు కాంగ్రెస్ కార్యాలయానికి రానున్న యువరాజు!

దాదాపు నెలరోజులకు పైగా సెలవు తీసుకున్న కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ నేడు తిరిగి రానున్నట్టు సమాచారం. ఆత్మపరిశీలన కోసం అంటూ, ఆయన సెలవు తీసుకొని ఎక్కడికి వెళ్లారో కూడా తెలియకుండా జాగ్రత్త పడిన సంగతి తెలిసిందే. ఆయన రాకపై కాంగ్రెస్ సీనియర్ నేతలకు కూడా సమాచారం లేదని తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ రోజు వస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారా? లేక మరి కొంతకాలం అమ్మ చూపిన బాటలో నడుస్తారా? అన్నది ఆయన వచ్చిన తరువాతనే తెలుస్తుందని ఆ పార్టీ నేత మణి శంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారు. అసలు ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఉందా? లేదా? అన్న విషయం కూడా రాహుల్ వస్తేనే తెలుస్తుందని అన్నారు. మరి రాహుల్ రాకపై నెలకొన్న సస్పెన్స్ ఇవాళన్నా తొలగుతుందో లేదో!

More Telugu News