సహజీవనం అంటే పెళ్లే... ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు కీలక తీర్పు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సహజీవనం అంటే పెళ్లే... ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు కీలక తీర్పు

వివాహం చేసుకోకుండా దీర్ఘకాలంపాటు ఇద్దరు కలసి ఉంటే వారిని పెళ్లయినవాళ్లు గానే భావిస్తామని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సహజీవన భాగస్వామి చనిపోయిన తరువాత అతని ఆస్తికి ఆమె వారసురాలు అవుతుందని న్యాయమూర్తులు జస్టిస్ ఎంవై ఇక్బాల్, జస్టిస్ ఏ రాయ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తమ తాత ఆస్తులపై కొందరు మనవలు, మనవరాళ్లు కలిసి వేసిన కేసును విచారించిన కోర్టు ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది. తమ బామ్మ 20 సంవత్సరాల క్రితం చనిపోగా, అప్పటినుంచి తాత వేరే మహిళతో కలిసి ఉంటున్నారని, కానీ వాళ్లు పెళ్లి చేసుకోలేదని తెలుపుతూ, ఇటీవల తాత మరణించారని, వీరికి పెళ్లి కాలేదు కాబట్టి, ఆయన ఆస్తికి ఆమె వారసురాలు కాదని వాదించారు. ఆ మహిళ తమకు వివాహం అయిందని నిరూపించుకోలేక పోయినప్పటికీ, కోర్టు మాత్రం అనుకూలంగానే తీర్పు ఇవ్వడం గమనార్హం.

More Telugu News