Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజధాని నిర్మాణానికి మరో 500 ఎకరాల భూమి అవసరం: మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అద్భుతంగా భూసేకరణ చేశామని, 33 వేల ఎకరాల భూమిని సేకరించామని చెప్పిన మంత్రి నారాయణ, మరో 500 ఎకరాల భూమి అవసరమని అన్నారు. తుళ్లూరు మండలంలోని మందడం గ్రామంలో భూమి చదును చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి అవసరమైన 500 ఎకరాల భూమిని భూసేకరణ ద్వారా తీసుకుంటామని అన్నారు. అనంతరం ఆయన కొద్దిసేపు ట్రాక్టర్ నడిపి భూమిని చదును చేశారు. రాజధాని రైతుల రుణమాఫీ సమస్యల కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

More Telugu News