ఎవరైనా పాడి ఉంటే మామూలు పాట అయ్యేది...మంచు లక్ష్మి వల్ల సంచలనం అయింది!: రఘు కుంచె
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎవరైనా పాడి ఉంటే మామూలు పాట అయ్యేది...మంచు లక్ష్మి వల్ల సంచలనం అయింది!: రఘు కుంచె

తన సంగీత దర్శకత్వంలో వచ్చిన 'దొంగాట' పాటను అభిమానులు ఆదరించినందుకు ధన్యవాదాలని సంగీత దర్శకుడు రఘు కుంచె చెప్పాడు. 'దొంగాట' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఈ పాటను వేరెవరైనా సింగర్ పాడి ఉంటే అది కేవలం పాట మాత్రమే అయి ఉండేదని, మంచు లక్ష్మి పాడడం వల్ల అది సంచలనం అయిందని అన్నాడు. ఈ పాటను విన్న తరువాత మోహన్ బాబు గారు ఫోన్ చేసి 10 నిమిషాలు అభినందిస్తూ మాట్లాడారని సంతోషం వ్యక్తం చేశాడు. యూట్యూబ్ లో మంచు లక్ష్మి పాడిన పాటకు విశేషమైన ఆదరణ లభించిందని, ఆదరించిన అందరికీ ధన్యవాదాలని రఘు తెలిపాడు.

More Telugu News