శృతి హాసన్ ను నేను తిట్టలేదు...అభ్యంతరం చెప్పింది మానేశా: మాణిక్యాలరావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శృతి హాసన్ ను నేను తిట్టలేదు...అభ్యంతరం చెప్పింది మానేశా: మాణిక్యాలరావు

సినీ నటి శృతి హాసన్ ను తాను తిట్టలేదని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడి కొండల మాణిక్యాలరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విమానంలో ఫోన్ లో కొంచెం గట్టిగా మాట్లాడానని శృతి హాసన్ ఎయిర్ హోస్టెస్ వద్ద అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఆ విషయాన్ని ఎయిర్ హోస్టెస్ తనకు తెలిపిందని అన్నారు. ఎయిర్ హోస్టెస్ తనకు విషయం చెప్పిన తరువాత తాను ఫోన్ ఆఫ్ చేసేశానని ఆయన చెప్పారు. అంతకు మించి ఏమీ జరగలేదని, వార్తల్లో వచ్చిన విషయాలపై తనకు అవగాహన లేదని ఆయన చెప్పారు. కాగా, మంత్రి పరుషపదజాలంతో దూషించడంతో విమానంలో శృతి హాసన్ కన్నీరు పెట్టుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటన విడుదల చేసిన సంగతి కూడా తెలిసిందే.

More Telugu News