Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పంజాబ్ పై రాజస్థాన్ గెలుపు... ఐపీఎల్-8 లో బోణీ కొట్టని ప్రీతి జింటా టీం!

ఐపీఎల్-8 సీజన్ లో బాలీవుడ్ నటి ప్రీతి జింటా జట్టుకు నిరాశ ఎదురైంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. సెహ్వాగ్, మ్యాక్స్ వెల్, మిల్లర్, బెయిలీ లాంటి పించ్ హిట్టర్లున్న పంజాబ్ జట్టు లక్ష్య ఛేదనలో బొక్క బోర్లా పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 162 పరుగులు చేసింది. జేమ్ప్ ఫాల్కరన్ (42), స్టీవ్ స్మిత్ (33), దీపక్ హుడా (30) రాణించడంతో రాజస్థాన్ ఏడు వికెట్లను కోల్పోయి 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టును ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (0) నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ లో తొలి ఓవర్ తొలి బంతికే అతడు డకౌటయ్యాడు. బ్యాటింగ్ లో దుమ్మురేపిన జేమ్స్ ఫాల్కనర్ బంతితోనూ రాణించాడు. మొత్తం మూడు వికెట్లు తీసి పంజాబ్ టాపార్డర్ ను కుప్పకూల్చాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి పంజాబ్ 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పంజాబ్ పై రాజస్థాన్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాట్ తో పాటు బంతితోనూ రాణించిన జేమ్స్ ఫాల్కనర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

More Telugu News