Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ నెల 15,16,17 తేదీల్లో వైఎస్సార్సీపీ బస్సుయాత్ర

తమ పార్టీ వచ్చే వారం నుంచి చేపట్టనున్న బస్సుయాత్ర వివరాలను వైఎస్సార్సీపీ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో యాత్రకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. ఈ నెల 15న రాజమండ్రి నుంచి బస్సుయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను పరిశీలించేందుకే మూడు రోజుల బస్సు యాత్ర చేపడుతున్నట్టు వివరించారు. ఆ యాత్రలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొంటారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టులను పరిశీలించడంతో పాటు రైతుల స్థితిగతులను తెలుసుకునేందుకు వారితో ముఖాముఖి కార్యక్రమం కూడా నిర్వహిస్తామన్నారు. ధవళేశ్వరం, పోలవరం, హంద్రినీవా, పట్టిసీమ, కృష్ణా బ్యారేజ్, వెలుగొండ, పోతిరెడ్డి, బనకచర్ల ప్రాజెక్టులను పరిశీలిస్తామని మీడియాకు తెలిపారు. అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరగాలన్నదే తమ బస్సు యాత్ర ఉద్దేశమని అన్నారు.

More Telugu News