Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డ్రైవర్ లేకుండా 5,500 కి.మీ ప్రయాణించిన కారు

బ్రిటన్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ ‘డెల్ఫీ’ బృందం చరిత్ర సృష్టించింది. ఈ సంస్థ తయారు చేసిన డ్రైవరు లేని కారు అమెరికాలోని 15 రాష్ట్రాల మీదుగా 9 రోజులపాటు మొత్తం 5,500 కి.మీ ప్రయాణించింది. మార్చి 22న శాన్‌ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన కారు కాలిఫోర్నియా మీదుగా న్యూయార్క్ నగరానికి చేరుకుని డ్రైవర్‌ లెస్ కార్ల ఆలోచన సాకారం దిశగా మరో మైలురాయిని అధిగమించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ కారులో ఆరు దూర శ్రేణి రాడార్లు, నాలుగు స్వల్ప శ్రేణి రాడార్లు, మూడు కెమెరాలు, ఆరు లిడార్ సెన్సార్లు అమర్చారు. అధునాతన అల్గారిథం సాఫ్ట్‌వేర్, అత్యాధునిక డ్రైవ్ అసిస్టెన్స్ సిస్టమ్స్ కారు ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడతాయి. ఇక వీటిపై ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగిపోతే, డ్రైవరు లేని కార్లు రోడ్ల మీద చక్కర్లు కొడతాయి.

More Telugu News