గవర్నర్ తో టీఎస్ సీఎం కేసీఆర్ భేటీ... విభజన సమస్యలు, శాతిభద్రతలపై చర్చ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గవర్నర్ తో టీఎస్ సీఎం కేసీఆర్ భేటీ... విభజన సమస్యలు, శాతిభద్రతలపై చర్చ

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన సమస్యలు, రాష్ట్రంలో శాంతి భద్రతలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇచ్చిన విందుకు డుమ్మా కొట్టిన కేసీఆర్, నేడు గవర్నర్ తో భేటీ కావడం విశేషం. ఇటీవల గవర్నర్ ఢిల్లీ పర్యటనపైనా కేసీఆర్ ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం.

More Telugu News