బెజవాడలో నార్లవారి విగ్రహావిష్కరణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బెజవాడలో నార్లవారి విగ్రహావిష్కరణ

'పత్రికొక్కటున్న పదివేల సైన్యమ్ము...' అంటూ వార్తాపత్రికల విశిష్టతను నొక్కి చెప్పి, తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించిన పాత్రికేయ దిగ్గజం నార్ల వెంకటేశ్వరరావు విగ్రహావిష్కరణ నేడు విజయవాడలో జరిగింది. ఇక్కడి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నార్ల విగ్రహాన్ని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పత్రికారంగంలో అక్షర యోధుడిగా పేరుగాంచిన నార్ల వెంకటేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లగడపాటి రాజగోపాల్, స్థానిక శాసన సభ్యులు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, నార్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

More Telugu News