: టాప్ 10 కంపెనీల నష్టం రూ. లక్ష కోట్ల పైనే!
గత వారంలో భారత స్టాక్ మార్కెట్ పతనం టాప్ 10 కంపెనీలకు సంయుక్తంగా లక్ష కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని మిగిల్చింది. గత వారంలో సెన్సెక్స్ సూచీ 28 వేల పాయింట్ల కన్నా కిందకు దిగజారగా, మార్కెట్ విలువ ప్రకారం టాప్ 10 స్థానాల్లోని కంపెనీలన్నీ నష్టపోయాయి. అత్యధిక నష్టం టీసీఎస్ కు వాటిల్లింది. ఈ కంపెనీ రూ. 18,304.32 కోట్లు నష్టపోగా, మార్కెట్ క్యాప్ రూ. 4.92 లక్షల కోట్ల వద్ద కొనసాగింది. ఇక ముకేష్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ రూ. 13,767.85 కోట్లు నష్టపోయి రూ. 2.62 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ను నమోదు చేసుకుంది. ప్రభుత్వ రంగ కోల్ ఇండియా రూ. 13,043.29 కోట్ల నష్టంతో రూ. 2.19 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కు పడిపోయింది. ఇతర కంపెనీల్లో ఓఎన్జీసీ రూ. 6,031.63 కోట్లు, ఐటీసీ రూ. 8,210.22 కోట్లు, హెచ్ డీఎఫ్ సీ రూ. 10,451.40 కోట్లు నష్టపోయాయి. ఇన్ఫోసిస్ రూ. 6,546 కోట్లు, సన్ ఫర్మా రూ. 3,406 కోట్లు నష్టపోయాయి.