తెహ్రీక్-ఏ-తాలిబన్ సంస్థ చీఫ్ ముల్లా ఫజులుల్లా (40) పాకిస్థాన్ లో జరిగిన వైమానిక దాడుల్లో హతమైనట్టు సమాచారం. పెషావర్ సైనిక పాఠశాలలో విద్యార్థులను ఊచకోత కోసిన ఘటనలో ఫజులుల్లానే సూత్రధారి. ఖైబర్ గిరిజన ప్రాంతంలో నిర్వహించిన భీకర వైమానిక దాడుల్లో అతడు ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. హకీముల్లా మసూద్ మరణించడంతో ఫజులుల్లా 2013లో పాక్ తాలిబన్ పగ్గాలు అందుకున్నాడు. కాగా, ఈ వారాంతంలో తాము ఖైబర్ గిరిజన ప్రాంతంలో జరిపిన దాడుల్లో కనీసం 80 మంది మిలిటెంట్లు చనిపోయి ఉంటారని, 100 మందికి పైగా గాయపడి ఉంటారని పాక్ సైన్యం తెలిపింది.
ఫజులుల్లా కూడా దాడుల్లో చనిపోయి ఉండొచ్చని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయం నిర్ధారణ కావాల్సి ఉంది. ఖైబర్-పఖ్తుంక్వా గవర్నర్ మెహ్తాబ్ ఖాన్ మాట్లాడుతూ, ఫజులుల్లా మరణం రానున్న రోజుల్లో నిర్ధారణ అవుతుందని తెలిపారు. అయితే, తాలిబన్ ప్రతినిధి మహ్మద్ ఖొరసాని మాత్రం ఫజులుల్లా మరణించాడనడాన్ని ఖండించారు. ఇవన్నీ నిరాధారమైన వార్తలని ఖొరసాని కొట్టిపారేశారు.
More Telugu News
-
భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు